Your cart is currently empty.
: In stock
Rs. 100.00 Rs. 120.00
రచయిత: జార్జి డబ్ల్యూ. నోబుల్ (George W. Noble)
గ్రంథ పరిచయం: పరిశుద్ధ గ్రంథంలోని ‘ఒక నిర్ణీత అంశంపై’ మీరు ప్రసంగించాలనుకొంటున్నారా? లేక మీరు చేయాలనుకొంటున్న ప్రసంగానికి సిద్ధపడుటకై కావలసిన ముఖ్య పీఠికలకొరకు వెదకుతున్నారా? అయితే పరిశుద్ధ గ్రంధంలోని అనేకానేక అంశాలపై సిద్ధపరచిన 650 ప్రసంగాలతో, ప్రతి ప్రసంగంలో భోధించేందుకు అవసరమైన ముఖ్యాంశాలతో (దాదాపు 5,000 పైగా అంశాలు, 10,000 పైగా రిఫరెన్సులతో) రూపొందించబడినదే ఈ ‘650 ప్రసంగములు’ అనే పుస్తకం. (రెండు భాగాలుగా ముద్రించబడినది)
ఒక సందర్భం అను ప్రస్తావన లేకుండ దాదాపు భోదించేందుకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ – అంటే సంఘ కూడికల్లోనూ, వాక్య ధ్యాన తరగతుల్లోనూ, కుటుంబ ప్రార్థనల్లోనూ, బైబిలు కళాశాలల్లోనూ, వీధి సువార్త సభల్లోనూ, సండే స్కూలు తరగతుల్లోనూ… ప్రతి సందర్భంలోను… విభిన్న అంశాలపై – అంటే రక్షణ, సువార్త, వాక్యధ్యానం, ప్రార్థన, కుటుంబం, వివాహం… మొదలైన అనేక అంశాలపై మీరు ప్రసంగించేందుకు అవసరమైన ‘విత్తనాలను’ ఈ పుస్తకం మీకందిస్తుంది.
మనోరంజకమైన ఈ పుస్తకం బోధించాలని ఆశించే ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచి, అవసరమైన బైబిలు జ్ఞానాన్ని అందించి ప్రోత్సాహపరుస్తుంది. ఈ పుస్తకం బోధకులు సంఘ కాపరులకు, ప్రసంగీకులకు, బైబిల్ కళాశాల అధ్యాపకులకు, బైబిల్ క్విజ్ నిర్వాహకులకు, బైబిలును అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి అత్యావశ్యకమైనది. ఈ పుస్తకం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ, సహాయసహకారాలతో క్రైస్తవ లోకానికి ఉపయోగపడాలని ఆశిస్తూ…
Synopsis:
This convenient book offers outlines for Scripture preaching for busy Pastors, Bible Students, Teachers, Lay Preachers and all Bible lovers, so that they may find many ‘Seeds’ in these outline which can lead to Sermons or Lessons filled with deeper understanding of the truth of God’s word.
Product description:
Added to cart successfully. What's next?
Product type: 1
1 x $00.00