Kraisthava Sunadha Keerthanalu (క్రైస్తవ సునాద కీర్తనలు) - Telugu Kraisthava Keerthanalu VOL 2 Hardcover – 29 September 2022
: In stock
Rs. 280.00 Rs. 389.00
1. బ్రదరన్ సంఘములు అన్ని ఈ పాటలు ఎక్కువగా పాడుటవలన వారి పాటలపుస్తకము వరుసలోని సంఖ్యల క్రమమునే వాడటం జరిగినది. 2. పల్లవి వచనము ఎన్ని సార్లు పాడాలి ఏది ఎప్పుడు పాడాలి అని సంఖ్యలతో సహా సూచించడం దీని ప్రత్యేకత 3. ప్రతి పాటకు ఇచ్చిన QR ద్వారా ఆ పాటను వినవచ్చు , నేర్చుకోవచ్చు , మరియు మ్యూజిక్ ట్రాక్ సహాయంతో పాడవచ్చు 4. UCSC - Universal Christian song code / ఈ నెంబర్ ద్వారా సంఘములో పాడే ప్రతి పాట ఒకే కచ్చితమైన వరుస క్రమము కలిగి ఉంటాయి ఈ పాటలపుస్తకము సహాయంతో సంగీత వాయిద్యములు లేకున్నా లేదా సంగీత వాయిద్యములు వాయించు జ్ఞానములేకున్నా చక్కగా తండ్రియైన దేవుని సంగీతముతో ఆరాధించులాగున టెక్నాలజీని అనుసంధానించడం జరిగినది. అంతే కాక ప్రభువు నందు ఎదుగుతున్నవారందరు రోజుకు ఒక పాటను నేర్చుకుంటూ క్రైస్తవ సంఘములలో పాడుతున్న అన్ని పాటలు రాగం తాళం తెలుసుకోవాలని మరియు చిన్న బిడ్డలు చిన్నప్పటినుండే సంగీతంతో పాట పాడటం నేర్చుకొని స్టేజఫియర్ను అధిగమించాలనే ఉద్ధేశ్యంతో ఈ పాటలపుస్తకము ప్రింట్ చేయడం జరిగింది. దీని ద్వారా దేవుని క్రొత్తగా నమ్ముకుని రక్షణ పొందిన వారు ఎవరి సహాయం లేకపోయినా చక్కగా పాటలు నేర్చుకుని అందరితో కలిసి పాటలు పాడే సామర్ధ్యం పొందాలని, రహస్యంగా ప్రభువైన క్రీస్తును వెంబడించే వారు కూడా ఈ పాటల పుస్తకం సహాయంతో ప్రభువును ఆరాధిచాలని, చిన్న సంఘములు, మారు మూల గ్రామ సంఘములు, అడవి ప్రాంతములలో ఉన్న సంఘములు, గృహ సంఘములు, ప్రపంచములో ఉన్న తెలుగు సంఘములు, మరియు ప్రత్యేకంగా దేశ రక్షణలో ఉన్న ప్రభువు బిడ్డలు కూడా ఎక్కడ ఉన్నా వాయిద్యములు వాయించే వారు లేకున్నా లేక వాయిద్యములు లేకున్నా వాయిద్యములు వాయించే జ్ఞానము లేకున్నా ఈ డిజిటల్ పాటల పుస్తకం సహాయంతో తండ్రియైన దేవుని సంగీతముతో కలిసి ఆరాధించవచ్చు .